Paanch Minar: జాను మేరీ జాను వీడియో సాంగ్! వాయిస్ భలే ఉందే.. తెలంగాణ పెంచల్ దాస్
ABN, Publish Date - May 03 , 2025 | 08:02 PM
రాజ్ తరుణ్, రాశీసింగ్ జంటగా రూపొందుతున్న చిత్రం పాంచ్ మినార్. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి జాను మేరీ జాను అంటూ సాగే ఓ టీజింగ్ సాంగ్ రిలీజ్ చేశారు.
రాజ్ తరుణ్ (Raj Tarun), రాశీసింగ్ (Rashi Singh)జంటగా రూపొందుతున్న చిత్రం పాంచ్ మినార్ (Paanch Minar). కనెక్ట్ మూవీస్ (Connect Movies) బ్యానర్‌పై మాదవి, MSM రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు రామ్ కుడుముల (Ram Kadumula) దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి జాను మేరీ జాను (Janu Meri Janu ) అంటూ సాగే ఓ టీజింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈమని శ్రీహర్ష (Sri Harsha emani) సాహిత్యం అందించిన ఈ గేయానికి శేఖర్ చంద్ర (Shekar Chandra) సంగీతం అందించగా వినాయక్ (Vinayak) ఆలపించారు. పాట వింటున్నంత సేపు పెంచల్ దాస్ పాడినట్టుగా అనిపించినా పాట చివరి వరకు ఆకట్టుకునేలా ఉంది.