సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

WAR 2 Song Promo: హృతిక్‌ వర్సెస్‌ తారక్‌.. 'దునియా సలాం అనాలి'

ABN, Publish Date - Aug 07 , 2025 | 11:23 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన చిత్రం ‘వార్‌-2’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో తారక్‌, హృతిక్‌ ఓ పవర్‌ఫుల్‌ డాన్స్‌ నంబర్‌ ఉందని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. ఆ పాట ఎలా ఉండబోతుంది? డైనమిక్‌ డాన్సర్‌ డాన్స్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉండబోతోందో చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. దానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ మేకర్స్‌ ‘దునియా సలాం అనాలి' అంటూ సాగే పాట  ప్రోమోను ప్రేక్షకులకు రుచి చూపించారు. ఇందులో హృతిక్‌, తారక్‌ ఇద్దరూ హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.

Updated Date - Aug 07 , 2025 | 11:57 AM