Guns And Roses: డొక్క చించి డోలు కట్టే యముడంట
ABN, Publish Date - Sep 15 , 2025 | 05:17 PM
‘ఓజీ’ (OG-ఓజస్ గంభీర) సినిమా విడుదల దగ్గరయ్యే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పవర్‌ఫుల్ సాంగ్ ‘గన్స్ అండ్ రోజెస్’ (Guns N Roses)ను సోమవారం విడుదల చేశారు. ఈ మూవీ తొలి గ్లింప్స్‌లో హైలైట్ అయిన ‘హంగ్రీ చీతా’ పాట ఇది. అద్వితీయ, హర్ష రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం విడుదల చేసిన ‘గన్స్ అండ్ రోజెన్’ పాటకు ఫిదా కావడమే కాదు.. అడిక్ట్ అయిపోవలసిందే అని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాట పై మీరు ఒక లుక్ వేయండి.