సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mohit Suri: సయారా నుండి వచ్చిన నాలుగో పాట

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:19 AM

యశ్ రాజ్ ఫిలిమ్స్ నుండి వస్తున్న తాజా చిత్రం సయారా. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ నుండి ఫోర్త్ సింగిల్ గా హమ్ సఫర్ విడుదలైంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి (Mohit Suri) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా 'సయారా' (Saiyaara). అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పద్దా (Aneet Padda) జంటగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ‘సయారా’ ఆల్బమ్‌లోని నాల్గవ పాట హమ్‌సఫర్‌ను తాజాగా విడుదలైంది.


ఇప్పటివరకు 'సయారా' చిత్రంలోని మూడు పాటలు విడుదల చేయగా అవన్నీ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. 'సయారా' టైటిల్ ట్రాక్, జుబిన్ నౌటియాల్ పాడిన 'బర్బాద్' సాంగ్, విశాల్ మిశ్రా ఆలపించిన 'తుమ్ హో తో' పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు సంగీత ద్వయం సచెట్ - పరంపర (Sachet - Parampara) పాడిన మరో రొమాంటిక్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. మోహిత్ సూరి మొదటి సారిగా ఈ సంగీత ద్వయంతో కలిసి పని చేయడం విశేషం. దీంతో ఈ పాట మీద సహజంగానే అంచనాలు పెరిగాయి.


ఈ పాట గురించి దర్శకుడు మోహిత్ సూరి మాట్లాడుతూ, 'అహాన్, అనీత్‌ కెమిస్ట్రీని చాటేలా సాచెట్ - పరంపర జంట అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఎలా ప్రేరేపించుకుని సంగీతం ఎలా తయారు చేసుకోవచ్చో చూడటానికి సాచెట్, పరంపర నిదర్శనంగా ఉంటార'ని అన్నారు. ఆయన ఈ పాట గురించి మరింత చెబుతూ, ‘హమ్‌సఫర్’ మా ఆల్బమ్‌లో చాలా ప్రత్యేకమైన పాట. సరైన సహచరుడు ఎదురైనప్పుడు జీవితం ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పే సందర్భంలో ఈ పాట వస్తుంది. 'హమ్‌సఫ'ర్ అనేది మీరు మీ జీవితంలోని ప్రేమతో ఉన్నప్పుడు మీరు పొందే చాలా సంతృప్తికరమైన అనుభూతి గురించి చెబుతుంది. అక్కడ సమస్యలు ఉండవు. ఒకరితో ఒకరు పూర్తిగా ఉన్నట్లు భావిస్తారు' అని చెప్పారు. 'సాచెట్, పరంపర ఇండియాలో టాప్ మోస్ట్ సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లుగా దూసుకుపోతోన్నారు. వారిని మా మ్యూజిక్ ఆల్బమ్ 'సయారా'లో చేర్చడం, వారి స్వరం, సంగీతం ద్వారా ప్రేమకు సరికొత్త కోణాన్ని జోడించడం ఆనందంగా ఉంది. ఈ పాటను ప్రజలకు అందించడానికి నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకులు ఈ పాటను ఇష్టపడతారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’ అని మోహిత్ సూరి తెలిపారు. 'సయారా' చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Also Read: M. S. Viswanathan: సంగీత ప్రియులను అలరించిన స్వర విన్యాసం

Also Read: Samantha: సమంత సెకండ్ హ్యాండ్ కామెంట్స్.. చాలా బాధపడిందన్న డిజైనర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 25 , 2025 | 11:19 AM