Tron: Ares: తెలుగులోనూ వస్తున్న 'ట్రాన్: ఆరీస్' చిత్రం
ABN, Publish Date - Jul 18 , 2025 | 02:48 PM
డిస్నీ సంస్థ నిర్మించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'ట్రాన్ : ఆరీస్'లో మూడో భాగం ఈ యేడాది అక్టోబర్ 10న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
డిస్నీ (Disney) నుంచి వస్తున్న మెగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ట్రాన్: ఆరీస్' (Tron: Ares). తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రాన్ సిరీస్‌లో ఇది మూడవ భాగం కాగా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌తో రూపొందిన ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా కథలో ఓ ఏఐ ప్రోగ్రామ్ ఆరీస్.. మానవుల ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడ ఏం చేయబోతున్నాడన్నదే ప్రధానాంశం. అకాడమీ అవార్డ్ విన్నర్ జారెడ్ లేటో ఆరీస్ పాత్రను పోషిస్తున్నాడు. అలాగే జెఫ్ బ్రిడ్జస్ మరోసారి ట్రాన్ యూనివర్స్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, విఎఫ్‌ఎక్స్ అన్నీ చక్కగా ఉండటంతో, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నైన్ ఇంచ్ నెల్స్ రూపొందించిన 'యాజ్ అలైవ్ యాజ్ యు నీడ్ మీ టు బీ' పాట మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'ట్రాన్: ఆరీస్' మూవీ ఈ యేడాది అక్టోబర్ 10న హిందీ, తెలుగు, తమిళ, ఆంగ్ల భాషల్లో విడుదల కానుంది. దాదాపు పదేళ్ళ తర్వాత వస్తున్న ట్రాన్ సీరిస్ మూవీ కావడంతో సహజంగానే అంతర్జాతీయ స్థాయిలో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.