Pankaj Tripathi: క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 టీజర్ వచ్చేసింది....

ABN, Publish Date - Apr 29 , 2025 | 04:24 PM

ఓటీటీలో చక్కని ఆదరణ పొందిన 'క్రిమినల్ జస్టిస్' వెబ్ సీరిస్ నాలుగో సీజన్ రెడీ అయ్యింది. తాజాగా దాని టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తెలుగు ప్రేక్షకులకు కోర్టు డ్రామా (Court Drama) లతో అనుబంధం కాస్తంత తక్కువే. అగ్ర కథానాయకులు కొందరు లాయర్ పాత్రలు చేసినా... పూర్తి స్థాయిలో కోర్టు బేస్డ్ మూవీస్ చేయలేదు. అలా వచ్చిన సినిమాలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. అయితే కొందరు హాలీవుడ్ సినిమాల ఇన్ స్పిరేషన్ తో ఆ తరహా సినిమాలు చేశారు కానీ అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. తాజాగా ప్రియదర్శి నటించిన 'కోర్ట్' (Court) సినిమా చక్కని విజయాన్ని సాధించింది. అలానే ఆ మధ్య సూర్య నటించిన 'జై భీమ్' (Jai Bheem) విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


ఇదిలా ఉంటే... సినిమా థియేటర్లలో కంటే కూడా ఇప్పుడు ఓటీటీల్లో కోర్ట్ డ్రామాస్ కు వ్యూవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటి వాటిలో 'క్రిమినల్ జస్టిస్' (Criminal Justice) కూడా ఒకటి. 2019లో ఈ వెబ్ సీరిస్ మొదటి సీజన్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో లాయర్ మాధవ్ మిశ్రా పాత్రను 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) చేశాడు. తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను చేసినా... వీక్షకులను మెప్పించగలిగాడు. దాంతో మరో కేసును తీసుకుని 2020లో రెండో సీజన్ ను, 2022లో మూడో సీజన్ ను మేకర్స్ స్ట్రీమింగ్ చేశారు. తాజాగా 'క్రిమినల్ జస్టిస్' నాలుగో సీజన్ రాబోతోంది. మే 22 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇది ప్రసారం కానున్న దృష్ట్యా తాజాగా ఈ వెబ్ సీరిస్ టీజర్ ను విడుదల చేశారు. మరి వరుసగా మూడు సార్లు విభిన్నమైన కేసులను టేకప్ చేసి వాదించి, గెలిచిన మాధవ్ మిశ్రా ఇప్పుడు ఏ కేసును స్వీకరించబోతున్నాడు చూడాలి.

Updated Date - Apr 29 , 2025 | 04:24 PM