China Piece Teaser: హీరోపై టెర్రరిస్ట్ ముద్ర ఎందుకు పడింది..
ABN, Publish Date - Jul 26 , 2025 | 10:22 PM
దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం శత్రువుల చేతికి చిక్కితే, ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి? కథానాయకుడిపై టెర్రరిస్ట్ ముద్ర ఎందుకు పడింది? అన్నది తెలియాలంటే ‘చైనా పీస్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకుడు. అయన దర్శకత్వంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘చైనా పీస్’. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ సందర్భంగా శనివారం టీజర్‌ను విడుదల చేశారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు కీలక పాత్ర పోషించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్