సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kantara Chapter 1: ‘వరాహరూపం'  పాటను మించేలా ‘బ్రహ్మ కలశ’  

ABN, Publish Date - Sep 28 , 2025 | 09:33 AM

రిషబ్‌శెట్టి నటించి దర్శకత్వంలో రూపొందిన  ‘కాంతార’  చిత్రంలోని ‘వరాహరూపం' పాట  ఎంతటి ఆదరణను సొంతం చేసుకుందో  తెలిసిందే! ఇప్పుడు ఆ సినిమాకు  ప్రీక్వెల్ గా తెరకెక్కిన 'కాంతార చాప్టర్  -1 ((kantara chapter 1)  నుంచి ‘వరాహరూపం'  పాటను గుర్తు చేసేలా మరో పాట సిద్ధమైంది.  తాజాగా ‘బ్రహ్మ కలశ’ అంటూ సాగే ఆడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అజనీష్‌ లోకనాథ్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. అబ్బి వి ఆలపించారు. ‘వరాహరూపం’ థీమ్‌తో మొదలైన మ్యూజిక్‌ ఆద్యంతం అలరించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 2న విడుదల కానుంది.  

Updated Date - Sep 28 , 2025 | 09:33 AM