12A Railway Colony: నరేశ్ సినిమా నుండి మెలోడీ సాంగ్...
ABN, Publish Date - Oct 31 , 2025 | 06:32 PM
అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల జంటగా నటిస్తున్న సినిమా '12A రైల్వే కాలనీ'. నాని కాసరగడ్డను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 'పొలిమేర' ఫాంచైజ్ మూవీస్ తీసిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి ఆయనే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. నవంబర్ 21న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఎమోషన్స్, లవ్, థ్రిల్ ఎలిమెంట్స్ తో మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. దీనికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, సాహిత్యాన్ని దేవ్ పవార్ అందించాడు. విశేషం ఏమంటే మరో సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ మెలోడీ సాంగ్ ను పాడారు. దాంతో ఈ పాటకు అదనపు ఆకర్షణ చేకూర్చినట్టు అయ్యింది. అల్లరి నరేశ్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ లవ్లీగా ఉంది. విజువల్స్ సైతం ప్లెజెంట్ గా ఉన్నాయి.
Updated at - Oct 31 , 2025 | 06:32 PM