సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naga Shaurya: 'బ్యాడ్ బోయ్ కార్తీక్' నుండి మెలోడీ సాంగ్...

ABN, Publish Date - Dec 04 , 2025 | 02:34 PM

నాగ శౌర్య (Naga Shaurya), విధి (Vidhi) జంటగా నటిస్తున్న సినిమా 'బ్యాడ్ బోయ్ కార్తీక్' (Bad Boy Karthik). ఇటీవల విడుదలైన 'సుందరకాండ' (Sundarakanda) లో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijay Kumar) ఈ సినిమాలో నాగశౌర్య సోదరిగా నటిస్తోంది. సాయికుమార్, పూర్ణ కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమౌతున్న ఈ సినిమాను రామ్ దేసిన (రమేష్) డైరెక్ట్ చేస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని మెలోడీ సాంగ్ 'పొమ్మంటే...'ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ ఏసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ పాడారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి తెలిపారు.

Updated Date - Dec 04 , 2025 | 02:58 PM