45 The Movie: ఒకే ఫ్రేమ్ లో శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి...
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:06 PM
45 ది మూవీ చిత్రంతో సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకుడిగా మారుతున్నాడు. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటించిన '45 ది మూవీ' నుండి ఓ క్రేజీ సాంగ్ విడుదలైంది. దీన్ని రోల్ రైడా రాయడంతో పాటు వినాయక్ తో కలిసి పాడారు.
'సు ఫ్రమ్ సో' (Su From So) సినిమాతో తెలుగువారికి చేరువయ్యాడు రాజ్ బి శెట్టి (Raj B Shetty). అతను ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా '45 ది మూవీ' (45 The movie). సూరజ్ ప్రొడక్సన్స్ పతాకంపై ఉమా రమేశ్ రెడ్డి, ఎం రమేశ్ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య (Arjun Janya) ఈ మూవీతో దర్శకుడిగా కొత్త అవతారమెత్తారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ దీనిపై అంచనాలను పెంచగా, తాజాగా మేకర్స్ ఓ క్రేజీ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) తో పాటు రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra) సైతం నటించారు.
'గెలుపు తలుపు దొరికే వరకూ దిగులు పడకురా' అంటూ సాంగ్ ఈ పాటకు సింగర్ రోల్ రైడా సాహిత్యం కూడా ఇవ్వడం విశేషం. అలానే వినాయక్ తో కలిసి రోల్ రైడా దీన్ని పాడారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆఫ్రికన్స్ నేపథ్యంలో సాగే ఈ డీప్ ఫారెస్ట్ సాంగ్ లో జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు వేయించారు. అర్జున్ జన్య దీనికి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాకు డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ చేతన్ డిసౌజా వంటి వారు పోరాట సన్నివేశాల్ని కంపోజ్ చేయగా, అనిల్ కుమార్ మాటల్ని అందించారు. ఈ మూవీకి సత్య హెగ్డే కెమెరామెన్‌గా, కె.ఎం. ప్రకాష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 25న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Also Read: Tuesday TV Movies: మంగళవారం, Nov 4.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Also Read: Tollywood: టీమ్ ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం.. సినీ ప్రముఖుల హర్షం