సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ghaati Trailer: సీతమ్మ లంకాదహనం చేస్తే...

ABN, Publish Date - Aug 06 , 2025 | 05:23 PM

క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషించిన 'ఘాటి' ట్రైలర్ విడుదలైంది. దానితో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ నూ మేకర్స్ తెలియచేశారు.

Ghaati Movie

క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty), విక్రమ్ ప్రభు (Vikram Prabhu) జంటగా నటించిన 'ఘాటి' చిత్రం ట్రైలర్ విడుదలైంది. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఈ మూవీని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. యు.వి. క్రియేషన్స్ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంజాయి తోటల నేపథ్యంలో సాగిన ఈ 'ఘాటి' ట్రైలర్ ఓ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళుతుందనిపిస్తోంది. అనుష్క అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో తన అభిమానులలో కొత్త జోష్ నింపబోతోంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చగా, నాగవెళ్ళి విద్యాసాగర్ స్వరరచన చేశారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 05:23 PM