Santhana prapthirasthu: వెన్నెల కిషోరూ పాట పాడేశాడు...
ABN, Publish Date - Oct 04 , 2025 | 05:41 PM
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. ఈ సినిమా కోసం కమెడియన్ వెన్నెల కిశోర్ తొలిసారి పాట పాడాడు.
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana prapthirasthu) మూవీతో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారాడు. ఈ చిత్రంలో ఆయన 'అనుకుందొకటిలే..' పాటను పాడాడు. ఈ చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ (Vennela Kishore) నవ్వులు పంచనున్నాడు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాడే పాటే 'అనుకుందొకటిలే..'.
'అనుకుందొకటిలే..' పాట ఎలా ఉందో చూస్తే - 'అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే, అయిపోలేదులే, గేరే మార్చులే, భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో..' అంటూ వినోదాత్మకంగా సాగుతుంది. దీనిని సునీల్ కశ్యప్ (Sunil Kashyap) కంపోజ్ చేయగా, బాలవర్థన్ లిరిక్స్ అందించారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నారు. విక్రాంత్, చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read: Film Piracy: సర్వీస్ ప్రొవైడర్స్ ను తప్పు పట్టిన నిర్మాత...