Beauty: అంకిత్.. ‘బ్యూటీ’ ట్రైలర్
ABN, Publish Date - Sep 14 , 2025 | 08:49 AM
అంకిత్ కొయ్య, నీలఖి పాత్రా హీరోహీరోయున్లుగా నటించిన చిత్రం ‘బ్యూటీ’.
మారుతీ నగర్ సుబ్రమణ్యం, ఆయ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అంకిత్ కొయ్య (Ankith Koyya) హీరోగా నటించిన చిత్రం ‘బ్యూటీ’ (Beauty). నీలఖి పాత్రా (Nilakhi Patra) కథానాయిక. నరేశ్ (Naresh VK), వాసుకీ ఆనంద్ (Vasuki Anand), నితన్ ప్రసన్న (Nitin Prasanna), ప్రసాద్ బెహరా (Prasad Behara) కీలక పాత్రలు పోషించారు.
ఆర్వీ సుబ్రమణ్యం (RV Subramanyamm) కథ, స్క్రీన్‌ప్లే అందించగా జె.ఎస్.ఎస్ వర్ధన్ (J S S VARDHAN) దర్శకత్వం వహించారు. అన్ని నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఔట్ అండ్ ఔట్ లవ్, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కూతురిపై విపరీతమైన ప్రేమ ఉన్న తండ్రి, వారికి దూరంగా వెళ్లిపోయిన ప్రేమజంట ఆపై ప్రియురాలు మిస్సింగ్, ఆమె కోసం వెతుకులాట ఈ నేపథ్యంలో జరిగే కథగా సినిమా ఉండనున్నట్లు స్పష్టంగా ఉండి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.