Jai Bagalaamukhii : ‘తమ్ముడు’ సినిమా నుంచి భక్తి గీతం
ABN, Publish Date - Jun 24 , 2025 | 06:18 PM
నితిన్ (Nithiin) కథానాయకుడిగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన సినిమా ‘తమ్ముడు’ (Thammudu). అక్కా తమ్ముడు అనుబంధం నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో లయ (Laya) కీలక పాత్ర పోషించారు. సప్తమీ గౌడ హీరోయిన్, వర్ష బొలమ్మ నాయికలు. జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ‘జై బగళాముఖి’ (Jai Bagalaamukhi) సాంగ్ లిరికల్ వీడియోను మంగళవారం రిలీజ్ చేశారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాసిన ఈ గీతాన్ని అబ్బీ ఆలపించారు.