Agraharam lo Ambetkar: అగ్రహారంలో అంబేద్కర్ టైటిల్ సాంగ్ రిలీజ్
ABN, Publish Date - Jul 14 , 2025 | 07:01 PM
మహనీయుల కథలు ఎప్పుడూ అపురూపమే. నాటి గొప్పవారి చరిత్రను నేటి తరానికి అందించేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి బాబాసాహేబ్ అంబేద్కర్ గురించి ఓ చిత్రం వస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ కీ అప్టేట్ వచ్చింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జీవన సిద్ధాంతాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'అగ్రహారంలో అంబేద్కర్' (Agraharam lo Ambetkar). ఈ సినిమా టైటిల్ సాంగ్ ను ప్రముఖ సామాజిక సంస్కర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఆవిష్కరించారు. దర్శకుడు మంతా కృష్ణచైతన్య (Mantha Krishna Chaitanya ) ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ చిత్రాన్ని రూపొందించారని, ఇది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని మంద కృష్ణ మాదిగ ఆకాంక్షించారు. అంబేద్కర్ ఆలోచనలను గౌరవించే ప్రతి వ్యక్తి ఈ సినిమాను తప్పక ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు ఈ చిత్రం ఇప్పటికే అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పురస్కారాలను అందుకుంది. రామోజీ - లక్ష్మోజి ఫిల్మ్స్ బ్యానర్‌పై మంతా కృష్ణచైతన్య స్వయంగా నిర్మాణం, దర్శకత్వం వహించడమే కాక, ప్రధాన పాత్రలో కూడా నటించారు. అంబేద్కర్ ఆశయాలను విశ్వవ్యాప్తం చేయడానికి ఒక వేదికగా ఈ సినిమా నిలుస్తుందని, సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.
అంబేద్కర్ సమసమాజ ఆలోచనలను ప్రపంచానికి చాటడానికి ఇది ఒక నిజాయితీ ప్రయత్నమని, ఎన్నో సవాళ్లను అధిగమించి, అంకితభావంతో ఈ సినిమాను తీర్చిదిద్దామని దర్శకుడు కృష్ణచైతన్య చెబుతున్నారు. కులం, మతం, ప్రాంతం వంటి విభజనలకు అతీతంగా, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషికి ఇది నివాళి అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించి, అంబేద్కర్ సందేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
Read Also: కె ర్యాంప్ గ్లింప్స్.. కిరణ్ సినిమాలో ఇన్ని బూతులా
Read Also: బాయ్ ఫ్రెండ్ మీద ప్రేమ ఓకే కానీ.. మరీ పబ్లిక్ లో ఇలా చేస్తే ఎలా పాప