JD Chakravarthy: ఇన్‌స్టా.. ఖాతా తెరిచిన జేడీ! నేనూ దేవుడిని నమ్మా.. కానీ అని వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 05 , 2025 | 10:48 AM
తెలుగు విలక్షణ నటుడు, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు జేడీ చక్రవర్తి (JD chekravarthy) సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాడు.
ప్రముఖ తెలుగు విలక్షణ నటుడు, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు జేడీ చక్రవర్తి (JD chekravarthy) సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో తన పేర ఎలాంటి అకౌంట్ లేని ఆయన తాజాగా జేడీ మ్యాక్స్ మోడ్ (JDMaxMode) పేరిట ఇన్ స్టా (instagram) ఖాతా ఓపెన్ చేసి ఓ వీడియో పోస్ట్ చేశారు.
అందులో ఇటీవల వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి నేను దేవుడిని నమ్మను గానీ అంటూ చేసిన వ్యాఖ్యలను బల పరిచేలా వీడియో పోస్ట్ చేశాడు. 'నేనూ దేవుడిని నమ్మను.. కానీ దేవుళ్లను నమ్ముతా. కక్కుర్తి ఎందుకు ఒకరిద్దరిని.. నేను అందరి దేవుళ్లను నమ్ముతా జై ఆంజనేయ.. కాదు కాదు జై శ్రీ హనుమాన్ అంటూ ముగించాడు.