సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Poola Chokka Naveen: పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్కా నవీన్.. ఎందుకంటే

ABN, Publish Date - Jul 17 , 2025 | 09:23 PM

ఈమధ్య కాలంలో సినిమాలు మౌత్ టాక్ ను బట్టే సక్సెస్ అవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు.

Poola Chokka

Poola Chokka Naveen: ఈమధ్య కాలంలో సినిమాలు మౌత్ టాక్ ను బట్టే సక్సెస్ అవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మొదటి షో పడగానే బయటకు వచ్చిన యూట్యూబర్స్.. రివ్యూల పేరుతో ఒక వీడియో తీసి పెట్టడం, దాన్ని నమ్మి చాలామంది ప్రేక్షకులు థియేటర్ కు వెళ్ళకపోవడం వలన ఎన్నో పెద్ద, చిన్న సినిమాలు పరాజయాల పాలవుతున్నాయి. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్.. ఒక చిన్న సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదురు యూట్యూబర్ ను అదుపులోకి తీసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.


పూలచొక్కా పేరుతో ఒక యూట్యూబ్ ను రన్ చేస్తున్న నవీన్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీల మీద తన అభిప్రాయం అని మరో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి లైక్స్, కామెంట్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూ అని చెప్పి.. చివర్లో రేటింగ్ గా టమోటాలు ఇస్తాడు. అతని దృష్టిలో 3 టమోటాలు అంటే హిట్.. రెండు టమోటాలు ఇస్తే యావరేజ్.. ఒకటి.. సగం టమోటా అంటే సినిమా పోయిందని అర్ధం.


ఇక ఈ మధ్యనే పూలచొక్కా.. వర్జిన్ బాయ్స్ అనే సినిమాపై రివ్యూ ఇచ్చాడు. అడల్ట్ కంటెంట్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కథను బట్టే ప్రేక్షకుడు సినిమా చూస్తాడు. ఇందులో కథేమీ లేదు. అసలు నన్ను అడిగితే వర్జిన్ బాయ్స్ చూడొచ్చా అంటే రిలాక్స్ బాయ్స్. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ సగం టమోటా అని చెప్పుకొచ్చాడు. అంటే వర్జిన్ బాయ్స్ సినిమా వరస్ట్ అని చెప్పుకొచ్చాడు. ఇక పూలచొక్కా రివ్యూపై వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారపునేని మండిపడ్డాడు. వాడెవడో పూలచొక్కా అంటా.. ఆది దగ్గర రెండు టమోటాలు లేవు.. మా సినిమాకు ఒక టమోటా ఇచ్చాడు అని ఫైర్ అయ్యాడు.


ఇక తాజాగా సదురు నిర్మాత.. పూలచొక్కాపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. సినిమా రివ్యూ ఇవ్వాలంటే కచ్చితంగా రూ. 40 వేలు ఇవ్వాలని, లేకపోతే నెగిటివ్ రివ్యూ ఇస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపాడట. నిర్మాత అంత డబ్బు ఇవ్వకపోవడంతో సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పూలచొక్కా నవీన్ ను విచారించడానికి పోలీస్ స్టేషన్ కు పిలిచారని తెలుస్తోంది. కొద్దిసేపటి తరువాత అతనిని వదిలేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Jul 17 , 2025 | 10:17 PM