సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Santhana Prapthirasthu: బాలల దినోత్సవం రోజు.. 'సంతాన ప్రాప్తిరస్తు'

ABN, Publish Date - Oct 11 , 2025 | 04:16 PM

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సంతాన ప్రాప్తిరస్తు చిత్రం నవంబర్ 14న విడుదల కాబోతోంది.

Santhana prapthirasthu

నేటి సమాజంలో యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu). వినోదమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. విక్రాంత్ (Vikrant), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన ఈ సినిమాలో 'వెన్నెల' కిశోర్ డాక్టర్ భ్రమరం గా నవ్వించబోతున్నాడు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sridhar Reddy), నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. తాజాగా 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాను బాలల దినోత్సవమైన నవంబర్ 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.

Updated Date - Oct 11 , 2025 | 04:18 PM