Havish New Movie: వినోద ప్రధానంగా...

ABN, Publish Date - May 17 , 2025 | 03:35 PM

యంగ్ హీరో హవిష్ నటునిగానే కాదు నిర్మాతగానూ అలరించారు... కొంత గ్యాప్ తరువాత మళ్ళీ హీరోగా కెమెరా ముందుకు వచ్చారు హవిష్... నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రంలో హవిష్ హీరోగా చిందేస్తున్నారు... ఈ సినిమా ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం...

"నువ్విలా, జీనియస్, రామ్ లీల, సెవెన్" చిత్రాలలో హీరోగా నటించి అలరించిన హవిష్ (Havish) కొంత గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో "రాక్షసుడు, ఖిలాడి" వంటి చిత్రాల నిర్మాణంలో తన తండ్రి కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) తో కలసి పాలు పంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ హీరోగా కెమెరా ముందుకు వచ్చారు. త్రినాథరావు నక్కిన (Trinadharao Nakkina) దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రంలో హవిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఓ పాటను ఇటీవల గచ్చిబౌలి అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో హవిష్, బృందంపై చిత్రీకరించారు. ఈ పాటకు యశ్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫి రూపొందించారు.


తనదైన మేకింగ్ స్టైల్ తో త్రినాథ రావు నక్కిన జనాన్ని ఆకట్టుకుంటున్నారు. "మేం వయసుకు వచ్చాం, నువ్విలా నేనిలా, నేను లోకల్, సినిమా చూపిస్త మావా, ధమాకా, మజాకా" వంటి చిత్రాలతో త్రినాథ రావు నక్కిన జనాన్ని ఆకట్టుకున్నారు. ఆయన రూపొందించిన చిత్రాలలో 'నేను లోకల్' విశేషాదరణ చూరగొంది. అదే తీరున హవిష్ తో రూపొందిస్తున్న చిత్రాన్ని కూడా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. హవిష్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతోన్న చిత్రం హార్నిక్స్ ఎల్.ఎల్.పి. పతాకంపై రూపొందుతోంది. నిర్మాత కోనేరు సత్యనారాయణ గతంలో "రాక్షసుడు, ఖిలాడీ" వంటి చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం హవిష్ హీరోగా సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రంలో కావ్యా థాపర్ (Kavya Thapar) నాయిక కాగా, గోపరాజు రమణ, రూపాలక్ష్మి, టీవీ ప్రదీప్, బి.టి. గణేశ్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి విక్రాంత్ శ్రీనివాస్ కథ, మాటలు సమకూర్చగా, మిక్కీ జె. మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలిపారు. మరి ఈ సినిమాతో హీరోగా హవిష్ ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.

Also Read: Pawan Kalyan: అజ్ఞాతవాసి గీతాన్ని హమ్ చేసిన విజయ్ దేవరకొండ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 17 , 2025 | 04:06 PM