Pawan Kalyan: అజ్ఞాతవాసి గీతాన్ని హమ్ చేసిన విజయ్ దేవరకొండ
ABN , Publish Date - May 17 , 2025 | 03:02 PM
యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అంటే విజయ్ దేవరకొండ కు ఎంతో అభిమానం. అతని తాజా చిత్రం 'కింగ్ డమ్'కు అతనే మ్యూజిక్ ఇస్తున్నాడు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం 'కింగ్ డమ్' (Kingdom) మూవీ చేస్తున్నాడు. ఈ నెల 30న రావాల్సిన ఈ సినిమా జూలై 4కు వాయిదా పడింది. దాంతో విజయ్ దేవరకొండకు కాస్తంత ఊపిరి పీల్చుకునే ఛాన్స్ దక్కింది. అందుకే తన తల్లి కోరిక మేరకు అలా బయట డిన్నర్ కు వెళ్ళాడు విజయ్ దేవరకొండ. క్షణం తీరిక లేకుండా పనిచేసే సినిమా వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ టైమ్ స్పెండ్ చేయాలన్నా అది అయ్యే పనికాదు! అందుకే తనకు, తన తల్లికి మధ్య డిన్నర్ విషయమై జరిగిన చాట్ ను కూడా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎలాగో కాస్తంత టైమ్ సెట్ చేసుకుని తల్లిదండ్రులతో విజయ్ దేవరకొండ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్ళాడు. అక్కడ రెస్టారెంట్లో వారితో దిగిన ఫోటోలతో పాటు విజయ్ తనే స్వయంగా ఓ పాటను హమ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు.
విజయ్ దేవరకొండకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అంటే విపరీతమైన అభిమానం. బహుశా ఆ అభిమానంతోనే కావచ్చు... అతని తాజా చిత్రం 'కింగ్ డమ్'కు అనిరుధ్ నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya). అయితే ఈ బ్యానర్ లో గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'అజ్ఞాతవాసి' (Agnyaathavaasi) చిత్రానికి కూడా అనిరుద్ధే సంగీత దర్శకుడు. ఆ పాటలు కూడా విజయ్ దేవరకొండను విపరీతంగా హంట్ చేసినట్టున్నాయి. నిన్న రాత్రి డిన్నర్ కు బయటకు వెళ్ళినప్పుడు కూడా అందులోని 'గాలి వాలుగా...' అనే పాటను హమ్ చేస్తూ... ఆ వీడియోనే పోస్ట్ చేశాడు. అంతేకాదు... ఇటీవల 'కింగ్ డమ్' మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పుడు అనిరుధ్ అంటే తనకెంతో అభిమానమో తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అజ్ఞాతవాసి' సినిమా పరాజయం పాలై... అందరినీ నిరాశకు గురిచేసింది. మరి 'కింగ్ డమ్' మంచి విజయం సాధించి... ఆ లోటును ఈ సంస్థకు, అనిరుధ్ కు తీర్చుతుందేమో చూడాలి.
Also Read: Srivishnu: గీతా ఆర్ట్స్ లో రెండు సినిమాలు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి