సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Yellamma: నాని పోయే.. నితిన్ పోయే.. ఇప్పుడు ఆ హీరోనా.. ఏంది వేణు ఇది

ABN, Publish Date - Aug 26 , 2025 | 10:04 PM

ఒక మంచి హిట్ కొట్టాకా కూడా బలగం వేణు( Venu) కు కలిసిరాలేదు. బలగం సినిమాతో పాన్ ఇండియా హిట్ ను అందుకున్న వేణు..

Yellamma

Yellamma: ఒక మంచి హిట్ కొట్టాకా కూడా బలగం వేణు( Venu) కు కలిసిరాలేదు. బలగం సినిమాతో పాన్ ఇండియా హిట్ ను అందుకున్న వేణు.. ఆ తరువాత ఎల్లమ్మ (Yellamma) అనే స్క్రిప్ట్ పట్టుకొని టాలీవుడ్ హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. మొదట ఎల్లమ్మ.. నాని (Nani) చేస్తున్నాడని అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ కూడా మొదలవుతుంది అనుకొనేలోపు నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. లైన్ బావుంది కానీ, వేణు తీరిదిద్దిన కథ అంతగా నచ్చలేదని, అది తనకు సెట్ అవ్వదని నాని తప్పుకున్నాడు.


ఇక నాని తరువాత ఎల్లమ్మ నితిన్ వద్దకు వెళ్ళింది. నితిన్ కూడా ఈ సినిమాను చేద్దామని ప్రయత్నించాడు. ఈలోపు వరుస పరాజయాలు. రాబిన్ హుడ్, తమ్ముడు.. దెబ్బ మీద దెబ్బ. దీంతో దిల్ రాజు.. నితిన్ తో అయ్యే వ్యవహారంలా లేదు అని అతనిని కూడా వద్దు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాని, నితిన్ కాకుండా ఎల్లమ్మకు కరెక్ట్ ఎవరు అనుకుంటున్న సమయంలో మరో యంగ్ హీరో శర్వానంద్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం శర్వా కూడా ప్లాపుల మధ్యలోనే నడుస్తున్నాడు. కానీ, మార్కెట్ పరంగా మరి అంత డౌన్ లో అయితే లేడు.


ప్రస్తుతం శర్వా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మధ్యనే దిల్ రాజు, వేణు.. శర్వాని కలవడం, ఎల్లమ్మ స్క్రిప్ట్ వినిపించి ఓకే చెప్పించడం జరిగినట్లు టాక్ నడుస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో రాజీపడని హీరోల్లో శర్వా ఒకడు. ఎల్లమ్మకు కూడా దిల్ రాజు కళ్లు చెదిరే పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం. శర్వా కనుక ఓకే అంటే వచ్చే ఏడాది ఎల్లమ్మ పట్టాలెక్కుతోందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత.. చివరకు ఎల్లమ్మ ఎవరి చెంతకు చేరుతుంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Kotha Lokah Chapter 1 Trailer: ఆడవాళ్లు రెండు రకాలు.. అదిరిపోయిన కొత్త లోక ట్రైలర్

Alia Bhatt: ఆ వీడియోలను షేర్ చేయకండి.. మీకు అలా జరిగితే ఊరుకుంటారా

Updated Date - Aug 26 , 2025 | 10:04 PM