సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Seetha Payanam: ఏ ఊరికి వెళ‌తావే పిల్లా.. అర్జున్ కూతురు ఇర‌గొట్టింది

ABN, Publish Date - Jul 10 , 2025 | 05:02 PM

యాక్ష‌న్ కింగ్ అర్జున్ తొలిసారి తెలుగులో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ కూతురు ఐశ్వ‌ర్యను టాలీవుడ్‌కు ప‌రిచయం చేస్తున్న చిత్రం సీతా ప‌య‌నం.

Seetha Payanam

యాక్ష‌న్ కింగ్ అర్జున్ (Arjun Sarja) తొలిసారి తెలుగులో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ కూతురు ఐశ్వ‌ర్య (Aishwarya )ను హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ప‌రిచయం చేస్తున్న చిత్రం సీతా ప‌య‌నం (Seetha Payanam). అర్జున్ స్వ‌యంగా నిర్మిస్తూ, క‌థ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాతో క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర సోద‌రుడి కుమారుడు నిరంజ‌న్ (Niranjan) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అనూప్ రూబెన్స్ (Anup Rubens) సంగీతం అందించాడు. అర్జున్‌, ప్ర‌కాశ్ రాజ్‌, దృవ్ స‌ర్జా (Dhruva Sarja) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

అయితే.. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై మంచి హైప్ తీసుకు రాగా తాజాగా ఈ ఏ ఊరికి వెళ‌తావే పిల్లా అంటూ సాగే మెలోడీ పాట‌ను విడుద‌ల చేశారు. అస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను రాహుల్ సిప్లీగంజ్‌, మ‌ధు ప్రియ పాడారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లోని ప్ర‌ముఖ ప్రాంతాల పేర్ల‌ను వాడుతూ సాగిన పాట విన‌డానికి , చూడ‌డానికి , విన‌డానికి విన‌సొంపుగా క‌నుల‌కింపుగా ఉండి అద్యంతం అక‌ట్టుకునేలా ఉంది. శ్రేష్టీ వ‌ర్మ అందించిన డ్యాన్స్ కూడా అదిరిపోయేలా ఉంది. మీరూ ఇప్పుడే చూసేయండి

Updated Date - Jul 10 , 2025 | 05:02 PM