Abishan Jeevinth: రజినీకాంత్ ను కలిసిన టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్..
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:13 PM
ఒక్క సినిమాతో కుర్ర డైరెక్టర్ అబిషన్ జీవింత్(Abishan Jeevinth) స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family).
Abishan Jeevinth: ఒక్క సినిమాతో కుర్ర డైరెక్టర్ అబిషన్ జీవింత్(Abishan Jeevinth) స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family). కోలీవుడ్ హీరో శశి కుమార్(Sasi Kumar), సిమ్రాన్(Simran) జంటగా నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రానికి అబిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటించాడు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ ను అందుకుంది.
కోలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ.. జియో స్టార్ లో అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కూడా టూరిస్ట్ ఫ్యామిలీ తన సత్తా చాటుతుంది. ఇక ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకు ఫిదా అవ్వడమే కాకుండా డైరెక్టర్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా రిలీజ్ అయినప్పుడే రాజమౌళి.. సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ అబిషన్ జీవింత్ పై ప్రశంసలు కురిపించాడు. ఇక నిన్నటికి నిన్న న్యాచురల్ స్టార్ నాని.. అబిషన్ జీవింత్ ని కలిసి మరీ ప్రశంసించాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు ఫిదా అయ్యాడు.
The RajaSaab Pre Teaser: అంచనాలను పెంచేస్తున్న రాజాసాబ్ ప్రీ టీజర్
తాజాగా అబిషన్ జీవింత్ .. రజినీకాంత్ నివాసంలో కలిసినట్లు తెలుస్తోంది. సినిమాను వీక్షించి న రజినీకాంత్.. చాలా బావుందని ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఇక రజినీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అబిషన్ జీవింత్ .. తన జీవితం ధన్యం అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. " నేను సినిమాల్లోకి అడుగుపెట్టిన కారణం.. ఈరోజుతోనే సంతృప్తి చెందినట్లు అనిపిస్తుంది. ఆయన నా పేరు పిలిచి నన్ను కౌగిలించుకున్న తీరు - నా ఒళ్ళంతా గగుర్పాటును కలిగించింది. ఆయన చిరునవ్వు చూసాక.. నేను చిన్నప్పుడు నుంచి చేసిన ప్రార్ధనలు సరిగ్గా నాకు అవసరమైనప్పుడు ఫలించాయేమో అనిపిస్తుంది. ఎంత గొప్ప మనిషి. సింప్లిసిటీకి నిదర్శనంగా కనిపించారు.
ఇంతకు మించిన మోటివేషన్ కానీ, ఆశీర్వాదం కానీ ఇంకేదీ అవసరం లేదు. మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను రజినీ సార్. ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు వచ్చేలా చేసిన నిర్మాత మగేష్ అన్న చాలా థ్యాంక్స్. సౌందర్య రజినీకాంత్ మ్యామ్.. మిమ్మల్ని కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతమ్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.