Ghaati: డిస్ట్రిబ్యూటర్ గా యశ్ మదర్
ABN, Publish Date - Aug 22 , 2025 | 03:05 PM
ఆలస్యమైతే అయింది గానీ.. అదిరిపోయే ఆఫర్ ను పట్టేసుకుంది ఆ సినిమా. పాన్ ఇండియా లాంచ్‌కు పర్ఫెక్ట్ సింక్ దొరికింది. పొరుగు రాష్ట్రంలో స్పెషల్ ప్రమోషన్ అవసరం లేకుండానే... ఇక అదరగొట్టబోతోంది. ఇదంతా అనుష్క 'ఘాటీ' గురించే సుమా...
కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి (Anushka Shetty) హీరోయిన్‌గా చేస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'ఘాటి' (Ghaati). క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) డైరెక్షన్‌లో .. యాక్షన్, అలాగే సూపర్ డ్రామాతో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. అప్డేట్స్ పెద్దగా లేకపోయినా... ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేయగా.. 'సైలోర్', 'దస్సోరా' లాంటి సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ ను బూస్ట్ చేసే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
'కె.జి.ఎఫ్. (KGF) స్టార్ యశ్ తల్లి పుష్పా అరుణ్ కుమార్ (Pushpa Arun Kumar) పి. ఎ. ఫిల్మ్స్ (PA Films) పేరుతో ఇప్పటికే రంగంలోకి దిగారు. ఈ బ్యానర్ లో కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ‘కొత్తలవాడి’ అనే మూవీని ఆమె నిర్మించి, ఆగస్ట్ 1న జనం ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా 'ఘాటీ' సినిమాతో పుష్పా అరుణ్ కుమార్ డిస్ట్రిబ్యూటర్ గానూ మారబోతున్నారట. కర్ణాటకలో 'ఘాటి'ని రిలీజ్ చేస్తూ ఆమె తన ఫస్ట్ స్టెప్ వేయాలని భావిస్తున్నారట. అనుష్క శెట్టి ఈ సినిమాలో చేసిన ఇంటెన్స్ యాక్టింగ్, ప్రమోషన్స్‌లో కనిపించిన క్రేజీ విజువల్స్ ఆమెను బాగా ఇంప్రెస్ చేశాయట.
'ఘాటి' హీరోయిన్ సెంట్రిక్ మూవీ కావడంతో, తన డిస్ట్రిబ్యూషన్ జర్నీకి ఇది పర్‌ఫెక్ట్ లాంచ్‌ప్యాడ్ అని పుష్ప అనుకుంటున్నారట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి యశ్ మదర్ నిర్ణయంతో 'ఘాటి' సినిమాకు ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే డైరెక్టర్ క్రిష్... ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో నిర్మితమౌతున్న ఈ సినిమా అటు క్రిష్, ఇటు స్వీటీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Read Also: Ajay Devgn: 'సు ఫ్రమ్ సో' డైరెక్టర్ తో అజయ్ దేవగన్
Read Also: Bun Butter Jam Review: 'బన్ బటర్ జామ్' ఎలా ఉందంటే.