కాంతారావు తనయుడికి ఆర్థిక సాయం
ABN, Publish Date - Jun 19 , 2025 | 05:49 AM
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకల్లో...
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకల్లో ఆయన రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుతో పాటు ప్రభుత్వం అందించిన నగదులో అధిక శాతం సామాజిక సేవకే ఖర్చుచేస్తానని ఆయన తెలిపారు. అలనాటి మేటి నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇంటి అద్దెకు కూడా కష్టంగా ఉందన్న విషయం తెలుసుకున్న యండమూరి రాజాను ఇంటికి పిలిచి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు.