OG Mania: సర్వం ఓజీ నామస్మరణే.. మిరాయ్ థియేటర్లలో ఓజీ
ABN, Publish Date - Sep 24 , 2025 | 01:05 PM
ఓజీ ( OG) విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజీ (They Call Him OG) విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. యాక్షన్ ప్యాక్డ్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఓజీ మానియా (OG Mania) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరినీ ఓ ఊపు ఊపేస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఓజీ నామస్మరణమే చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో దిల్ రాజు (Dil raju) బ్రదర్స్ సైతం చేరి మరింత క్రేజ్ తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ మా ప్రయాణంలో తోడుగా, ఇన్నేళ్లూ మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అతనితో ప్రతి చిత్రం నిజంగా గుర్తుండిపోతుంది ఇప్పుడు #TheyCallHimOG అనే ఈ భారీ తుఫానులో మీము కూడా అంతర్భాగం అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాము అంటూ పవన్ కళ్యాణ్‌కి పెద్ద అభిమాని అయిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు OG మెర్చండైజ్ ధరించి మీ వెంటే మేము అంటు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కాగా నిజాం ఏరియాలో ఈ సినిమాను ఎస్వీసీ రిలీజ్ చేస్తుండడం విశేషం. అదే సమయంలో మరో నిర్మాత సితార నాగవంశీ సైతం OG హుడీ వేసుకొని ఫోటో షేర్ చేసి తన సపోర్ట్ తెలియజేశాడు.
మరోవైపు.. వరుసభారీ చిత్రాలతో టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ (Vishwa Prasad) ఓ అడుగు ముందుకేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్మించగా ఇటీవల ప్రేక్షకుల ఎదుటకు వచ్చి రికార్డు కలెక్షన్లతో దూసుకెళుతున్న సినిమా మిరాయ్ (Mirai). ఇప్పుడు ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న రెండు రాష్ట్రాలలోని థియేటర్లలో ఓజీ ప్రీమియర్స్, ఫస్ట్ డే షోలు వేసుకునేందుకు స్వచ్చందంగా మద్దతు తెలిపాడు. ఓ రోజు తర్వాత తిరిగి తన మిరియా సినిమా షోలు నడపనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ న్యూస్ సైతం టాలీవుడ్‌లో బాగా వైరల్ అవుతోంది.