Dhandoraa: ప్రీమియర్లతో.. ముందే వస్తున్న దండోరా
ABN, Publish Date - Dec 04 , 2025 | 10:23 PM
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న కలర్ ఫోటో, బాక్సాఫీస్ హిట్ బెదురులంక 2012 వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని తాజాగా నిర్మించిన చిత్రం ‘దండోరా’
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న కలర్ ఫోటో, బాక్సాఫీస్ హిట్ బెదురులంక 2012 వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని తాజాగా నిర్మించిన చిత్రం ‘దండోరా’ (Dhandora). మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బింధు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్నీ మంచి స్పందనను రాబట్టుకోగా ఈ చిత్రం డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల అవుతోంది.
సామాజిక స్పృహ కలిగించే ముఖ్యమైన అంశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమా, అగ్ర వర్ణాల అణచివేత, ఇంటర్‌కాస్ట్ లవ్ మ్యారేజ్‌లపై ఇంకా జరుగుతున్న దౌర్జన్యాల నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ అక్కడి సంస్కృతి, పాత ఆచారాలు, సంప్రదాయాల్ని చూపిస్తూ వ్యంగ్యం, సరదా, భావోద్వేగాలను కలిపి చెప్పిన కథ ఇది.
ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తేనే దర్శకుడు చెప్పాలనుకున్న ఆలోచన ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. గ్రామీణ మట్టి వాసనతో పాటు సమాజాన్ని ఆలోచింపజేసే సందేశం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఈ సినిమాలోని పాటలు టి-సిరీస్ ద్వారా విడుదల అవుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, శక్తివంతమైన కంటెంట్, స్టార్ కాస్ట్ కలయికగా రూపుదిద్దుకుంటున్న ‘దండోరా’ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.