సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nandamuri Balakrishna: సీనియర్ స్టార్స్ లో ఆ క్రెడిట్... బాలయ్యదే!

ABN, Publish Date - Dec 20 , 2025 | 08:21 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రికార్డ్స్ జాబితాలో మరోటి చేరింది. ఆయన నటించిన తాజా చిత్రం 'అఖండ-2-తాండవం (Akhanda 2 Thaandavam)' టాక్ ఎలా ఉన్నా పలు కేంద్రాలలో ఇప్పటికీ మంచి ఆదరణతో సాగుతోంది.

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రికార్డ్స్ జాబితాలో మరోటి చేరింది. ఆయన నటించిన తాజా చిత్రం 'అఖండ-2-తాండవం (Akhanda 2 Thaandavam)' టాక్ ఎలా ఉన్నా పలు కేంద్రాలలో ఇప్పటికీ మంచి ఆదరణతో సాగుతోంది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. రిలీజ్ సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా కూడా డిసెంబర్ 12 న అఖండ 2 తాండవం రిలీజ్ అయ్యి మిక్డ్స్ టాక్ ను అందుకుంది. అయితే ఈ సినిమాకు ఎంత నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయినప్పటికీ ఎనిమిది రోజుల్లో వంద కోట్ల మార్కు దాటేసింది.

ఇక దాంతో వరుసగా ఐదు చిత్రాలతో వంద కోట్లు చూసిన ఏకైక సీనియర్ స్టార్ గా బాలకృష్ణ నిలిచారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ హీరోకు ఇలాంటి రికార్డ్ లేదు. 2021 డిసెంబర్ 2న విడుదలైన 'అఖండ' సినిమాతో తొలిసారి బాలయ్య వంద కోట్ల క్లబ్ లో చేరారు. ఆ సినిమా టోటల్ రన్ లో రూ.150 కోట్లు పోగేసింది. తరువాత 2023 జనవరి 12న విడుదలైన బాలయ్య 'వీరసింహారెడ్డి' మూవీ రూ.134 కోట్లు రాబట్టింది. అదే సంవత్సరం అక్టోబర్ 19న రిలీజైన 'భగవంత్ కేసరి' సినిమా రూ.138 కోట్లు సంపాదించింది.

ఇక 2025 జనవరి 12న జనం ముందు నిలచిన 'డాకూ మహరాజ్' సినిమా టోటల్ రన్ లో రూ.130 కోట్లు చూసింది. ఈ యేడాది డిసెంబర్ 12న ప్రేక్షకులను పలకరించిన 'అఖండ-2-తాండవం' ఇప్పటికి రూ.102 కోట్లు వసూలు చేసింది. ఇలా వరుసగా ఐదు చిత్రాలతో బాలయ్య వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Updated Date - Dec 20 , 2025 | 08:21 PM