Vijay Devarakonda: రౌడీ హీరో మళ్లీ త్యాగం చేయాల్సిందే.. ?
ABN , Publish Date - Jun 03 , 2025 | 08:21 PM
జూన్ 12 న వీరమల్లు వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు
ఏ ముహూర్తాన హరిహర వీరుమల్లు(HariHara Veeramallu) మొదలుపెట్టారో కానీ, ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన ప్రతిసారి.. వేరే సినిమాలు వెనక్కి వెళ్లడం, రిలీజ్ అవ్వడం జరుగుతున్నాయి కానీ, ఇచ్చిన డేట్ నా వీరమల్లు వచ్చింది లేదు. పవన్ సినిమా రిలీజ్.. అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దేవరకొండ(Viajy Devarakonda)కు భారంగా మారింది.
కొన్నేళ్లుగా హిట్ లేకపోవడంతో కింగ్డమ్(Kingdom) పైనే విజయ్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. అవుట్ ఫుట్ కూడా మంచిగా వచ్చిందని టాక్. మొదట ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అది అవ్వలేదు . ఆ తరువాత మేలో రిలీజ్ అన్నారు. అది కుదరలేదు. దానికి కారణం హరిహర వీరమల్లు అని చెప్పొచ్చు. వీరమల్లు వస్తుంది అనడంతో కింగ్డమ్ వెనక్కి తగ్గి జూలై 4 న రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ డేట్ మీద మరోసారి వీరమల్లు కన్నేశాడు.
Also Read: Surekha Vani: పొట్టి బట్టలు వేసుకోవడంపై ట్రోలింగ్.. సురేఖావాణి ఏం చెప్పిందంటే..?
జూన్ 12 న వీరమల్లు వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ వాయిదా పడితే మాత్రం జూలై 4, 27 తేదీల్లో వీరమల్లు రిలీజ్ అవ్వాలి. జూలై 27 న కన్నప్ప(Kannappa) రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పటికే మంచు విష్ణు(Manchu Vishnu) ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశాడు. ప్రభాస్(Prabhas) ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో కన్నప్ప పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఆ డేట్ ను వదలడానికి విష్ణు ససేమిరా అన్నాడని టాక్. ఇక ఉన్న ఒకే ఒక్క అప్షన్ కింగ్డమ్.. జూలై 4. మళ్లీ విజయ్ నే త్యాగం చేయాల్సి వస్తుంది అని చెప్పొచ్చు.
ఒకవేళ విజయ్ ఒప్పుకోకపోయినా.. ఆ సినిమా నిర్మిస్తుంది సితార ఎంటర్ టైన్మెంట్స్ అంటే నాగవంశీ. పవన్ సినిమా కాబట్టి త్రివిక్రమ్(Trivikram) రంగంలోకి దిగుతాడు. ఎలాగూ కింగ్డమ్ నిర్మాతల్లో ఒకరు త్రివిక్రమ్ భార్యనే కాబట్టి.. భర్త మాటను ఆమె తిరస్కరించదు. నాగవంశీని కన్విన్స్ చేయడం గురూజీకి పెద్ద పని కాదు. ఇంకోపక్క కింగ్డమ్ కూడా రీషూట్ పనులతో బిజీగా ఉంది. నెల రోజుల్లో ఆ పనులన్నీ ఫినిష్ చేసి, ప్రమోషన్స్ చేయడం అంటే పెద్ద రిస్క్ అనే చెప్పొచ్చు. ఈ లెక్కన చూసుకుంటే కూడా కింగ్డమ్ పక్కకు తప్పుకుంటుందనే అనుకోవచ్చు. మరి జూలై 4 న కింగ్డమ్ వస్తుందా .. ? వీరమల్లు వస్తాడా.. ? అనేది తెలియాలంటే మేకర్స్ నోరు విప్పెవరకు ఆగాల్సిందే.