Surekha Vani: పొట్టి బట్టలు వేసుకోవడంపై ట్రోలింగ్.. సురేఖావాణి ఏం చెప్పిందంటే..?
ABN , Publish Date - Jun 03 , 2025 | 07:20 PM
నటి సురేఖా వాణి(Surekha Vani) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగువారికి ఆమె సుపరిచితమే.
నటి సురేఖా వాణి(Surekha Vani) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగువారికి ఆమె సుపరిచితమే. స్టార్ హీరోల సినిమాల్లో అమ్మగా. అక్కగా ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే .. సినిమాల్లో కనిపించేంత పద్దతిగా సురేఖావాణి బయట కనిపించదు. ఎవరి జీవితం వారిది అని అనుకున్నా.. నిత్యం కూతురు సుప్రీతతో కలిసి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈ తల్లీకూతుళ్లపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.
సురేఖావాణి అయినా అప్పుడప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తుందేమో కానీ, సుప్రీత(Supritha)మాత్రం నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక ఎప్పటినుంచో సురేఖావాణి.. కూతురు సుప్రీతను హీరోయిన్ గా లాంచ్ చేయాలనీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఎట్టకేలకు సుప్రీతను హీరోయిన్ గా చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్(Amardeep), సుప్రీత జంటగా నటిస్తున్న చిత్రం చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి(‘Chowdary Gari Abbayi Tho Naidu Gari Ammayi). ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేశారు.
Also Read: Vishwambhara: ఆ గందరగోళం ఎందుకనే.. రిలీజ్ ఫిక్స్ చేయలేదట..
ఇక ఈ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో సురేఖావాణికి వారి డ్రెస్సింగ్ పై వస్తున్న నెగెటివ్ ట్రోల్స్ కు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. మూవీలో చేస్తున్న స్టార్స్ కు, యాంకర్స్ కు వాళ్ళకంటూ ఒక సోషల్ లైఫ్ ఉంటుంది. వారు బయటకు ఎక్కడికి వెళ్లినా.. ఫోటోలు పెట్టినా.. బయట జనాలు ఒక ఆడపిల్ల బట్టలు ఎలా వేసుకుంటుంది అనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. వారికి మీరేం చెప్తారు అన్న ప్రశ్నకు సురేఖావాణి ఈ విధంగా చెప్పుకొచ్చింది.
" ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. అందరి బుర్రలు ఒకలా ఆలోచించలేవు. వాడేదో అలా ఆలోచించుకొని.. అలా రాసుకుంటున్నాడు. అది వాడి పర్సెప్షన్. కానీ, అది మనం ఎంతవరకు తీసుకుంటున్నామన్నది మన మైండ్ కు ఉండాలి. ఇదివరకు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మేమిద్దరం రియాక్ట్ అయ్యి.. రిప్లైలు ఇచ్చేవాళ్ళం. ఆ తరువాత చూసి నవ్వుకోవడం స్టార్ట్ చేసాం. దాని తరువాత అసలు పట్టించుకోవడం మానేసాం" అని చెప్పుకొచ్చింది.