December 5: సెంటిమెంట్ ఫలించేనా...
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:54 PM
పాన్ ఇండియా మూవీ పుష్ప -2 విడుదలైన రోజే, ప్రభాస్ ది రాజా సాబ్ సైతం జనం ముందుకు వస్తోంది. పుష్ప -2 సినిమా రిలీజ్ డేట్ సెంటిమెంట్ ది రాజా సాబ్ కూ వర్తిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సినిమా రంగం సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతుంది. సూపర్ డూపర్ హిట్ అందుకున్న సినిమా విడుదలైన రోజు తమ సినిమాను కూడా రిలీజ్ చేస్తే... ఆ డేట్ తమకీ కలిసి వస్తుందేమో అనే ఆశ మేకర్స్ లో ఉంటుంది. కొద్ది గంటల క్రితం విడుదలైన 'ది రాజా సాబ్' (The Raja Saab) టీజర్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. అద్భుతం... అమోఘం అని చెప్పలేం కానీ వింటేజ్ ప్రభాస్ ను డైరెక్టర్ మారుతి (Maruthi) మంచిగా ప్రెజెంట్ చేశాడని దాన్ని చూసిన వారంతా అంటున్నారు. నటీనటుల పెర్ఫార్మెన్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) కూ అత్యధిక మార్కులు వేసేస్తున్నారు.
'ది రాజా సాబ్' మూవీ టీజర్ తో ఒక్కసారిగా అందరి అటెన్షన్స్ ను తన వైపు తిప్పుకుంది. ఇప్పటి వరకూ ఆ సినిమాపై సో... సో... గా ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీని తీసి పారేయలేమని, ఊహించిన దానికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుందని, అలానే చాలా గ్రాండియర్ గా దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న విషయం అర్థమౌతోంది. దర్శకుడు మారుతి సైతం తనకు లభించిన రేర్ ఆపర్చునిటీని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడని అంతా నమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే... 'ది రాజా సాబ్' విడుదలలో ఇక ఎలాంటి జాప్యం ఉండదని, ఇప్పటికే ప్రకటించిన విధంగా డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కావడం ఖాయమని తేలిపోయింది. ఇవాళ్టి టీజర్ లోనూ ఆ విషయాన్ని ప్రస్తావించారు. దాంతో గత యేడాది ఇదే రోజు వచ్చిన 'పుష్ప -2' ను సినీ జనం తలుచు కుంటున్నారు. లాస్ట్ ఇయర్ 'పుష్ప -2' మూవీ డిసెంబర్ 5న విడుదలై అఖండ విజయాన్ని అందుకోవడమే కాదు... దాదాపు 1800 కోట్ల రూపాయల గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. ఇప్పుడు అదే తేదీకి వస్తున్న మరో తెలుగు పాన్ ఇండియా మూవీ 'ది రాజా సాబ్' కూడా ఆ స్థాయి విజయాన్ని కైవసం చేసుకుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.
'పుష్ప' మొదటి భాగం వరల్డ్ వైడ్ సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ ను వసులు చేసింది. దానికి పూర్తి భిన్నంగా 'పుష్ప -2' బాక్సాఫీస్ బరిలో స్వైర విహారం చేసింది. అయితే ఇప్పటికే ప్రభాస్ నటించిన 'బాహుబలి -2' సినిమా గ్రాండ్ రికార్డ్స్ ను క్రియేట్ చేసిన నేపథ్యంలో 'ది రాజా సాబ్' సైతం ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందని సినీ జనాలు భావిస్తున్నారు. పైగా ఇప్పుడు బాలీవుడ్ లో హారర్ కామెడీ చిత్రాల హవా సాగుతోంది. 'స్త్రీ -2' సినిమా అందుకు తాజా ఉదాహరణ. సో... అన్నీ మంచి శకునములే అన్నట్టుగా 'ది రాజా సాబ్'కు అన్నీ అంశాలు కలిసి రాబోతున్నాయని మేకర్స్ అనుకుంటున్నారు.
Also Read: Film Awards : రిపీట్ అయ్యింది పెళ్ళిచూపులు మాత్రమే...
Also Read: Rashmika Mandanna: ఆ హీరోల నుంచి అవి.. విజయ్ నుంచి అన్నీ కావాలి