Pawan Kalyan: ఓజీ.. ప్రమోషన్స్ కి వస్తాడా
ABN , Publish Date - Sep 05 , 2025 | 09:20 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). కుర్ర డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). కుర్ర డైరెక్టర్ సుజీత్(Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందకు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు.
ఇక ఎట్టకేలకు ఓజీ సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే ఈ ప్రమోషన్స్ కు పవన్ వస్తాడా.. ? రాడా అనేదే ఇక్కడ మిస్టరీగా మారింది. ఆయన గత చిత్రం హరిహర వీరమల్లు సినిమాకు పవన్ దగ్గరుండి ప్రమోషన్స్ చేశాడు. అసలు పవన్ ప్రమోషన్స్ కు వస్తాడు అనుకోలేదు. ఒకప్పుడు అయినా ప్రచారంలో ఉన్నాడు.. రావచ్చుగా అనుకొనేవారు. కానీ, ఇప్పుడు పదవిలో ఉన్నాడు అస్సలు రాడు.. అని అనుకున్నవారందరికీ షాక్ ఇచ్చేలా వీరమల్లు ప్రమోషన్స్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడు.
పవన్ ప్రమోషన్స్ కు రావడంతో సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగింది. అంత హైప్ వచ్చినా వీరమల్లు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇక్కడ ఓజీ లెక్క వేరు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి సినిమాపై హైప్ ఎక్కడా తగ్గలేదు. అసలు ఒక్క టికెట్ 5 లక్షలకు అమ్ముడుపోయిందంటేనే సినిమాపై ఎంత హిప్ ఉందో అర్దం అవుతుంది. ఇక ప్రమోషన్స్ కు పవన్ కూడా వస్తే అంచనాలు మరింత పెరుగుతాయి. అంటే పవన్ రాకపోయినా .. ప్రమోషన్స్ విషయంలో పెద్ద నష్టమేమీ జరగదని చెప్పుకొస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు రావాల్సిన హైప్ వచ్చేసింది. ఇప్పుడు పవన్ ప్రమోషన్స్ కు వస్తే అది బోనస్ అవుతుంది. మరి పవన్ ఓజీ ప్రమోషన్స్ కు వస్తాడా.. ? లేదా ..? అనేది చూడాలి.
AndhraKingTaluka: మొన్న లిరిసిస్ట్.. నేడు సింగర్..
Anushka Moni Mohandas: వ్యభిచార దందా.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరోయిన్