Samantha: వారికి భయపడ్డ సమంత.. అందుకే ఇలా పెళ్లి!
ABN , Publish Date - Dec 01 , 2025 | 02:34 PM
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సడెన్ గా బాంబ్ పేల్చింది. ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సడెన్ గా బాంబ్ పేల్చింది. ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎప్పటినుంచో సమంత.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ జంట మాత్రం ఇలాంటివేమి పట్టించుకోకుండా కెమెరాలకు పోజులు ఇవ్వడం దగ్గర నుంచి పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం వరకు అన్ని చేస్తూనే ఉన్నారు.
ఇక సడెన్ గా ఈరోజు ఉదయం సామ్ - రాజ్ ఈషా యోగాశ్రమంలో చాలా సింపుల్ గా జరిగింది. ముందు నుంచి కూడా ఈ పెళ్లి గురించి ఎవరికీ ఎలాంటి అవగాహనా కూడా లేదు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ మొత్తం షాక్ కు గురవుతున్నారు. అయితే సమంత ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి.. ? ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇదే. సామ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం.. కేవలం ట్రోలర్స్ అనే మాట వినిపిస్తుంది. వారికి భయపడే ఆమె ఇలా సింపుల్ గా పెళ్లి చేసుకుందని చెప్పుకొస్తున్నారు.
అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో సామ్ ని ట్రోల్ చేసినంత ఇంకెవరిని ట్రోల్ చేయలేదు అని చెప్పొచ్చు. చిన్న విషయం ఆమె గురించి తెలిసినా కూడా ఆమె టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయేది. ఇక చై - శోభితా పెళ్లి అప్పుడు సామ్ నే తప్పు పట్టారు. ఎప్పుడు చై - శోభితా ఫోటోలు షేర్ చేసినా సామ్ నువ్వు డిజర్వ్ కాదు.. నీకు ఇది కావాల్సిందే అని కామెంట్స్ పెట్టడం కామన్ గా మారిపోయింది.
ఇంకోపక్క రాజ్ తో రిలేషన్ అని రూమర్స్ వచ్చినప్పటి నుంచి.. అతని కాపురంలో నిప్పులు పోసావు. పెళ్లి అయిన వాడే కావాల్సి వచ్చాడా.. అని ఒక పక్క.. రాజ్ మాజీ భార్య తన జీవితంలోకి వచ్చి అంతా నాశనం చేసింది. కర్మ అనేది ఒకటి ఉంటుంది అని ఆమె మరోపక్క ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఇక పెళ్లి డేట్ కానీ, వేదిక కానీ ముందే చెప్తే మరింత ట్రోల్ అయ్యేది. అంతేకాకుండా మొదటి పెళ్లిలానే గ్రాండ్ గా చేస్తే.. రెండో పెళ్లి కూడా ఇంత గ్రాండ్ గా చేసుకోవాలా.. డబ్బు ఉన్నోడు కదా అందుకే చూపిస్తున్నారు అని మళ్లీ చర్చ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అనే.. ఆమె హీల్ అయిన చోటనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈసారి అయినా సామ్ తన భాగస్వామితో సంతోషంగా ఉంటే చాలు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Samantha weds Raj Nidimoru: ఘనంగా.. సమంత, రాజ్ నిడమోరు పెళ్లి!
Venkatesh: విక్టరీ ఫ్యాన్స్ కు పండగే పండగ...