సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG Release Date Locked: దసరా బరిలో అవి లేనట్టేనా...

ABN, Publish Date - May 25 , 2025 | 07:33 PM

పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటన రావడంతో అదే సీజన్ లో రావాల్సిన రెండు సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరి ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఈ యేడాది సమ్మర్ సీజన్ ను సినిమా వాళ్ళు సక్రమంగా వినియోగించుకోలేదు. ఆ తర్వాత రాబోతున్న దసరా సీజన్ పై ఇప్పటి నుండే దృష్టి పెట్టారు. దాంతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో తెరకెక్కుతున్న 'అఖండ -2' (Akhanda -2) ను దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఆ రకంగా షూటింగ్ కూడా సాగుతోంది. జార్జియాలో జరిగే షెడ్యూల్ తో సినిమా దాదాపు పూర్తవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వినితో కలిసి 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. సంయుక్త (Samyuktha_ ఇందులో నాయికగా నటిస్తోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన గత మూడు చిత్రాలు 'సింహా' (Simha), 'లెజెండ్' (Legend), 'అఖండ' (Akhanda) ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సహజంగానే ఈ నాలుగో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు 'అఖండ -2'ను చూద్దామా అని ఉవ్విళ్లూరుతున్నారు.


ఇప్పుడు దసరా సందర్బంగా పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG) సెప్టెంబర్ 25న విడుదల అవుతుందనే ప్రకటన వచ్చింది. దాంతో 'అఖండ -2' విడుదల వాయిదా పడుతుందేమోననే సందేహం కలుగుతోంది. ఎందుకంటే... బాలకృష్ణ చిత్రం మీదకు పోటీగా ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్‌ సినిమాను విడుదల చేయరు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నా తెలుగు దేశం, జనసేన పార్టీలు వారి హీరోల చిత్రాలను ఒకే రోజున బరిలోకి దించడమనేది జరిగే పనికాదు. సో... 'అఖండ -2' దసరాకు రాదనే నిర్ధారణకు వచ్చే తర్వాతే 'ఓజీ' సినిమా రిలీజ్ డేట్ ను నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించారన్నది ఇండస్ట్రీ టాక్.

ఇదిలా ఉంటే... పవన్ కళ్యాణ్‌ మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సంబరాల యేటి గట్టు' (Sambarala Yeti Gattu) ను కూడా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దసరా కానుకగా సెప్టెంబర్ 25నే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అది కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. అయితే... చూస్తూ చూస్తూ... పవన్ కళ్యాణ్‌ సినిమాతో పోటీ పడుతూ సాయి దుర్గా తేజ్ మూవీని మేకర్స్ విడుదల చేసే ప్రసక్తే ఉండదు. సో... 'సంబరాల యేటి గట్టు' సినిమా కూడా దసరా బరి నుండి తప్పుకున్నట్టే! మరి 'ఓజీ' సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ దసరాకు అది ఒక్కటే విడుదల అవుతుందా? లేకపోతే ఆ సమయానికి మరే సినిమాలైనా దీనితో పాటు పండగ సీజన్ కాబట్టి వస్తాయా అనేది వేచి చూడాలి.

Updated Date - May 25 , 2025 | 07:42 PM