OG Movie: వాషి యో వాషి.. ఫ్యాన్స్ ను హైప్ తో చంపేస్తారా
ABN, Publish Date - Sep 19 , 2025 | 09:07 PM
చిన్నా లేదు.. పెద్దా లేదు.. ప్రతి ఒక్కరు ఓజీ (OG).. ఓజీ అని అరవడమే. సాధారణంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా వస్తుంది అంటేనే ఇండస్ట్రీ మొత్తం కళ్లన్నీ దానిపైనే ఉంటాయి.
OG Movie: చిన్నా లేదు.. పెద్దా లేదు.. ప్రతి ఒక్కరు ఓజీ (OG).. ఓజీ అని అరవడమే. సాధారణంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా వస్తుంది అంటేనే ఇండస్ట్రీ మొత్తం కళ్లన్నీ దానిపైనే ఉంటాయి. అలాంటింది ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఓజీ వస్తుంది అనేసరికి అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఓజీ థియేటర్ లోకి వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారం రోజుల్లో ఆ ఎదురుచూపులు తెరపడనుంది. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా సెప్టెంబర్ 25 న థియేటర్ లో అడుగుపెట్టనున్నాడు.
అసలు వారం రోజుల్లో రిలీజ్ డేట్ పెట్టుకొని ప్రమోషన్స్ ఎక్కడరా అని అడగడానికి వీలు లేకుండా డీవీవీ మేకర్స్ రోజుకొక సర్ ప్రైజ్ తో చంపేస్తున్నారు. అనుకున్న సమయానికి అప్డేట్స్ ఇస్తేనే గ్రేట్ అనుకుంటే.. ఏకంగా ఈసారి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేసేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ భారీ హైప్ ను క్రియేట్చేస్తుంది . సెప్టెంబర్ 21 న ఓజీ ట్రైలర్ రిలీజ్ కానుంది. దాని కోసమే ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు.
వాషి యో వాషి అంటూ జపాన్ భాషలో ఒక హైకూను రిలీజ్ చేశారు. అయితే అందులో విశేషమేంటంటే అది పవన్ తన వాయిస్ తో చెప్పడం. ఇంతకు మించిన సర్ ప్రైజ్ ఫ్యాన్స్ కు ఇంకేం కావాలి. దీంతో వాషి యో వాషి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ హైకూ కన్నా ముందు ఓజీ.. విలన్ ఓమీ కి ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఓమీ.. ఓ మై డియర్ ఓమీ, ఎగెరెగిరి పడుతున్నావ్. నీలాంటివాడిని ఎలా నేలమీదకు దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెప్తాను విను అంటూ వాషి యో వాషి ని మొదలుపెట్టాడు. జపాన్ భాషలో ఉన్న హైకూను పవన్ టకాటకా చెప్పుకొచ్చాడు. దీని అర్ధం తెలియకపోయినా.. అసలు పలకడానికి రాకపోయినా కూడా ఫ్యాన్స్ దీనిని నేర్చేసుకొని థియేటర్ లో పాడడానికి సిద్దమైపోతున్నారు. మరి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Sharwanand: విడిపోయిన శర్వానంద్ దంపతులు.. ?
Sadaa: తండ్రి కన్నుమూత.. ఎమోషనల్ అయిన సదా