సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

David Reddy: వార్ డాగ్.. మంచు మనోజ్ నట విశ్వరూపం

ABN, Publish Date - Dec 17 , 2025 | 06:47 PM

మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డేవిడ్ రెడ్డి (David Reddy). హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఏ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్ మరియు నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు.

David Reddy

David Reddy: మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డేవిడ్ రెడ్డి (David Reddy). హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఏ చిత్రాన్ని వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్ మరియు నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించిన ప్రకటన ఎప్పుడో వచ్చినా మధ్యలో మనోజ్ మిరాయ్ సినిమాతో బిజీగా ఉండడంతో అప్డేట్ రావడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఎప్పుడూ రొటీన్ కథలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకొనే మనోజ్ ఈసారి కూడా సరికొత్త కథను ఎంచుకున్నాడు.

డేవిడ్ రెడ్డి 1897-1922 కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించి, ఢిల్లీలో పెరిగి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక వ్యక్తి కథ అని మొదటి నుంచి మేకర్స్ చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి వార్ డాగ్ పేరుతో ఒక గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. స్వాతంత్యం కోసం పోరాడిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ తో పాటు డేవిడ్ రెడ్డి కూడా బ్రిటీషర్లపై పోరాటం చేసాడని, కానీ, అటు బ్రిటిష్ వాళ్లు.. ఇటు ఇండియా వాళ్లు కూడా అతనిని ద్వేషిస్తారని వాయిస్ ఓవర్ లో చెప్పుకొచ్చారు.

ఇక వార్ డాగ్ అంటే ఒక బైక్ పేరు. ఆ బైక్ ని తయారుచేస్తున్నట్లు చూపిస్తూ వెనుక ఒక చిన్న పిల్లాడికి తండ్రి కథ చెప్తున్నట్లు డేవిడ్ రెడ్డి గురించి చెప్పించారు. మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను కదా. ఆ తరువాత జలియన్ వాలా బాగ్. భారతీయుల రక్తం తాగిన రోజు. ఎదురించి పోరాడలేక చాలామంది సర్దుకుపోయారు. కానీ, ఒక్కడు మాత్రం ఎదిరించడానికి సిద్దమయ్యాడు. మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్స్ కి అతను వార్ డాగ్ అయ్యాడు అంటూ మనోజ్ క్యారెక్టర్ గురించి ఎలివేషన్ ఇచ్చి హైప్ పెంచారు.

చివర్లో డేవిడ్ రెడ్డిగా మనోజ్ ఎంట్రీ అదిరిపోయింది. ఇది బ్రిటిష్ ఇండియా కాదు.. డేవిడ్ రెడ్డి ఇండియా అని హిందీలో చెప్పడం హైలైట్. మనోజ్ ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక రవి బసూర్ మ్యూజిక్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. కెజిఎఫ్ కి ఇచ్చినట్లే హై లెవెల్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షూటింగ్ ని మొదలుపెట్టినట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో మనోజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Dec 17 , 2025 | 06:49 PM