సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Vishnu: ‘మా’.. ఆరోగ్యంపై దృష్టి! కిమ్స్ సన్ షైన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

ABN, Publish Date - Nov 09 , 2025 | 07:01 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు ఆరోగ్యంపై దృష్టి సారించారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్‌తో కలిసి ‘మా’ సభ్యుల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

Manchu Vishnu Maa

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విష్ణు మంచు (Vishnu Manchu), సభ్యుల ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకుంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ దిశగా ఇప్ప‌టికే పలు హెల్త్ క్యాంప్‌లు, మెడికల్ చెకప్‌లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్‌తో కలిసి మరో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు, ట్రెజరర్ శివ బాలాజీ, సభ్యుడు రాజీవ్ కనకాలతో పాటు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్, సీనియర్ జనరల్ ఫిజీషియన్ డా. నవ వికాస్ జుకంటి, వాస్క్యులర్ మరియు డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్ట్ డా. నిషాన్ రెడ్డి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డా. ముదుమల ఐసాక్ అభిలాష్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం మేం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరి ఫిట్‌నెస్‌, వెల్‌బీయింగ్ మాకు అత్యంత ప్రాధాన్యం. ఈ క్యాంప్‌లో భాగస్వామ్యమైన సభ్యులందరికీ, మాకు సహకరించిన కిమ్స్ సన్ షైన్ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం మేం ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం. అందరి సహకారం చాలా విలువైనది” అని పేర్కొన్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. “ఆర్టిస్టులు ఎక్కువగా బిజీ షెడ్యూల్‌లో పని చేస్తారు. వారి ఆరోగ్యం కోసం ఇలాంటి క్యాంప్‌లు కొనసాగడం చాలా అవసరం. విష్ణు మంచు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం” అన్నారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ.. ‘మా’ సభ్యుల కోసం ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం మాకు గౌరవంగా ఉంది. విష్ణు మంచు గారి ముందడుగు చాలా గొప్పది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు మేము పూర్తి సహకారం అందిస్తాం” అని తెలిపారు.

Updated Date - Nov 09 , 2025 | 07:25 PM