దం దిగా దం
ABN, Publish Date - Jun 26 , 2025 | 02:01 AM
దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించిన ‘వర్జిన్ బాయ్స్’ వచ్చే నెల 11న విడుదల కానుంది. ఈ సినిమాలో మిత్రశర్మ, గీతానంద్...
దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించిన ‘వర్జిన్ బాయ్స్’ వచ్చే నెల 11న విడుదల కానుంది. ఈ సినిమాలో మిత్రశర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నిఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి ప్రణవ్ చాగంటి రాసిన ‘దం దిగా దం’ పాటను విడుదల చేశారు. యాసిర్ నిసర్ పాడిన ఈ పాటకు స్మరణ్ సాయి స్వరాలు అందించారు. ఈ సందర్బంగా నిర్మాత రాజా దారపనేని మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్‌గా ఉండే చిత్రం ఇది. వినోదంతో పాటు మంచి ప్రేమకథ కూడా ఉంది. సెన్సార్ సభ్యులు చూసి ప్రశంసించారు. తెలంగాణలో ఏషియన్ సునీల్ విడుదల చేస్తున్నారు. వచ్చే నెల 11న వచ్చే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ అందరికీ కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయని దర్శకుడు దయానంద్ చెప్పారు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు ఆందిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.