సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Virgin Boys: అన్ని హంగులతో అలరించేందుకు

ABN, Publish Date - Jul 07 , 2025 | 02:50 AM

యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన చిత్రం వర్జిన్‌బాయ్స్‌. మిత్రశర్మ, గీతానంద్‌, శ్రీహాన్‌, రోనిత్‌ ప్రధాన తారాగణం. దయానంద్‌ గడ్డం దర్శకత్వంలో...

యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన చిత్రం వర్జిన్‌బాయ్స్‌. మిత్రశర్మ, గీతానంద్‌, శ్రీహాన్‌, రోనిత్‌ ప్రధాన తారాగణం. దయానంద్‌ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించారు. ఈనెల 11న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా టికెట్లు కొన్నవారిలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన 11 మందికి ఐఫోన్లు బహుమతిగా ఇస్తామని చిత్రబృందం తెలిపింది. దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ‘నా కళాశాల అనుభవాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రమిది. ‘వర్జిన్‌బాయ్స్‌’ అనే టైటిల్‌కు కచ్చితంగా సరిపోయేలా కథ ఉంటుంది’ అని చెప్పారు. రాజా దారపునేని మాట్లాడుతూ ‘ఈ సినిమాలో పాపులర్‌ నటీనటులు ఎవరూ లేరు. కథే ఈ చిత్రానికి హీరో. ప్రేక్షకులను అబ్బురపరిచే కంటెంట్‌తో వస్తున్నాం’ అని తెలిపారు. గీతానంద్‌ మాట్లాడుతూ ‘ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మంచి సినిమా చూసిన ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి వెళ్తారు’ అని అన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 02:56 AM