Sreeleela: కిస్సిక్ ని మించి వయ్యారి భామ.. శ్రీలీల అందాలే హైలైట్

ABN , Publish Date - Jul 04 , 2025 | 07:30 PM

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి (Kireeti Reddy) జూనియర్ (Junior) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.

Sreeleela

Sreeleela: ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి (Kireeti Reddy) జూనియర్ (Junior) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. రాధా కృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో కిరీటి సరసన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల (Sreeleela) నటిస్తుండగా.. చాలాకాలం తరువాత బొమ్మరిల్లు హాసిని జెనీలియా (Genelia)తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిన జూనియర్ జూలై 18న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. వైరల్ వయ్యారి అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మాస్ ఎనర్జీ ఈ సాంగ్ లో కనిపిస్తుంది. లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను DSP, హరిప్రియ తమ వాయిస్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. యూత్‌తో కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా లాంగ్వేజ్, ట్రెండీ ఫ్రేసెస్ తోఅదరగొట్టేశారు.


కిరీటి రెడ్డి, శ్రీలీల కలిసి డాన్స్ అదరగొట్టారు. టీజర్ లో కిరీటిని చూసి ఇతడు హీరోనా.. ? అని ట్రోల్ చేసిన నెటిజన్స్.. ఈ సాంగ్ లో అతని డ్యాన్స్ కు ఫిధా అయ్యారు. శ్రీలీల లాంటి డ్యాన్సర్ కు సరిసమానంగా కిరీటి డ్యాన్స్ అదిరిపోయింది. ఇక శ్రీలీల డ్యాన్స్ గురించి, అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిస్సిక్ సాంగ్ లో ఏ రేంజ్ లో అయితే అందాల ఆరబోత చేసిందో.. అంతకు మించి వైరల్ వయ్యారి సాంగ్ లో కనిపించింది శ్రీలీల. అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌, ఎలిగెన్స్‌తో సాంగ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇకనుంచి శ్రీలీలను కిస్సిక్ బ్యూటీ అని కాకుండా వైరల్ వయ్యారి అని పిలవడం మొదలుపెడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ సినిమా శ్రీలీలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

War 2: ఒక్క సాంగ్ కు అన్ని కోట్లా.. చిన్న సినిమా తీయొచ్చు తెలుసా

Updated Date - Jul 04 , 2025 | 07:31 PM