War 2: ఒక్క సాంగ్ కు అన్ని కోట్లా.. చిన్న సినిమా తీయొచ్చు తెలుసా
ABN , Publish Date - Jul 04 , 2025 | 06:27 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) వార్ 2 (War 2) తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. హృతిక్ రోషన్ (Hrithik Roshan), టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ కు సీక్వెల్ గా వార్ 2 రాబోతుంది.
War 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) వార్ 2 (War 2) తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. హృతిక్ రోషన్ (Hrithik Roshan), టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ కు సీక్వెల్ గా వార్ 2 రాబోతుంది. ఇక ఇందులో ఈసారి హృతిక్, ఎన్టీఆర్ తో తలపడనున్నాడు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఎన్టీఆర్ బర్త్ డే వీడియో సినిమాపై హైప్ ను మరింత పెంచేశాయి.
ఇక వార్ 2 .. ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. వార్ 2 నుంచి ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వార్ 2 లో ఒక సాంగ్ కోసం మేకర్స్ అక్షరాలా రూ. 15 కోట్లు ఖర్చుపెట్టారని తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క సాంగ్ కోసమే రూ. 15 కోట్లంట. ఆ సాంగ్ సెట్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని, అందుకే ఈ సాంగ్ కు అంత ఖర్చుపెట్టారని సమాచారం.
ఇక ఈ సాంగ్ లో హృతిక్ - ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేయనున్నారట. ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లే. ఈ సాంగ్ లో ఇద్దరు హీరోలు తాండవం చేయబోతున్నారని సమాచారం. ఈ సాంగ్ కు ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నాడట. వారం రోజుల్లో సాంగ్ షూట్ ఫినిష్ అవ్వాలి. లేదు అంటే ఇంకా బడ్జెట్ పెరుగుతుందని టాక్. ఇక ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ పలు రకాలుగా మాట్లాడకుంటున్నారు. వామ్మో.. ఒక్క సాంగ్ కు రూ. 15 కోట్లా.. ఒక చిన్నపాటి సినిమా తీసేయొచ్చు. అంతలా ఈ సాంగ్ లో ఏముంటుంది.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి రూ. 15 కోట్ల సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Thammudu: పవన్ టైటిల్ కూడా కాపాడలేకపోయింది తమ్ముడు