నేటి తరానికి తగిన చిత్రం
ABN, Publish Date - Jul 02 , 2025 | 04:11 AM
అక్షయ్, మదన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్లాక్ నైట్’. సతీష్ కుమార్ దర్శకత్వంలో వై.వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు...
అక్షయ్, మదన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్లాక్ నైట్’. సతీష్ కుమార్ దర్శకత్వంలో వై.వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలను చిత్ర పరిశ్రమ పెద్దలు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ‘మరోసారి వింటేజ్ తరహా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. నేటి తరానికి తగ్గట్టు మరోసారి అటువంటి సినిమాలను తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, దర్శకుడు సతీష్ కుమార్, నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడారు.