సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kattappa: ‘కట్టప్ప’ ఎవరు.. విజయేంద్రప్రసాద్‌ కొత్త కథ

ABN, Publish Date - Sep 27 , 2025 | 03:29 PM

‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో కట్టప్ప (Kattappa)పాత్రకి ప్రత్యేకమైన స్థానం ఉంది. బాహుబలి రెండో పార్ట్‌పై ఆసక్తి కలిగించడానికి ఆ పాత్ర ఎంతగానో ఉపయోగపడింది.

Kattappa

‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో కట్టప్ప (Kattappa)పాత్రకి ప్రత్యేకమైన స్థానం ఉంది. బాహుబలి రెండో పార్ట్‌పై ఆసక్తి కలిగించడానికి ఆ పాత్ర ఎంతగానో ఉపయోగపడింది. ఈ చిత్రంలో బాహుబలి, భల్లాల దేవ, దేవసేన పాత్రలు ఎంతగా పాపులర్‌ అయ్యాయో.. కట్టప్ప పాత్ర కూడా ప్రేక్షకాదరణ పొందింది. కట్టప్ప ‘బాహుబలి’ని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న యావత్‌ దేశం విపరీతంగా వైరల్‌ అయింది.

ఇప్పుడు రచయిత విజయేంద్రప్రసాద్‌, దర్శకుడు రాజమౌళి కట్టప్ప పాత్రతో ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మాహిష్మతి సామ్రాజ్యంలో కట్టప్ప ఎందుకు నమ్మిన బంటుగా ఉన్నాడు? అతని చరిత్ర ఏమిటి? తన కుటుంబ నేపథ్యం ఏంటి? ఎందుకు బానిసగా ఉండాల్సి వచ్చింది? అన్నది ఈ కథలో చెప్పబోతున్నారట. అయితే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తారా? మరొకరు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కానీ కట్టప్ప ప్రీ విజువలైజేషన్‌ వర్క్‌ మాత్రం మొదలైయింది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Sep 27 , 2025 | 03:37 PM