Vijay Devarakonda: బ్రేకింగ్.. విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
ABN, Publish Date - Oct 06 , 2025 | 07:18 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కారుకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కారుకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి NH 44 పై పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ కారు ప్రమాదం జరిగింది. వేరే కారును ఓవర్ టేక్ చేయబోయి విజయ్ కారును ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. వెంటనే విజయ్ దేవరకొండ, అతని ఫ్యామిలీ వేరే కారులో పయనించారు. ఉండవల్లి పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండ డ్రైవర్ ఈ ప్రమాదంపై ఫిర్యాదు చేసిన్నట్లు సమాచారం.
విజయ్ కు ప్రమాదం జరిగిందని తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కు ఏమైందో అని కంగారుపడుతున్నారు. ఇక ఇటీవలే విజయ్ కు హీరోయిన్ రశ్మికకు నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే.