సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Devarakonda: పుట్టపర్తిలో.. విజయ్‌ దేవరకొండ

ABN, Publish Date - Oct 05 , 2025 | 05:33 PM

పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని విజయ్‌ దేవరకొండ దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన ప్రశాంతి నిలయం చేరుకున్నారు.

పుట్టపర్తి సత్యసాయి (Puttaparthi sai baba) మహాసమాధిని విజయ్‌ దేవరకొండ (vijay Devarakonda) దర్శించుకోనున్నారు. ఈ మేరకు ఆయన ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్‌ అతిథి గృహం వద్ద ట్రస్ట్‌ సభ్యులు విజయ్‌కు స్వాగతం పలికారు. విజయ్‌కి పుట్టపర్తితో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. శ్రీసత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు.

ఇటీవల హీరోయిన్‌ రష్మికతో (Rashmika) విజయ్‌ నిశ్చితార్థం జరిగినట్టు వార్తలొచ్చాయి.  హైదరాబాద్‌లోని విజయ్‌ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక చేసినట్టు తెలిసింది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఆ వార్తలను ఇద్దరిలో ఎవరూ ఖండించకపోవడం తో పెళ్లి ఖరారైందని అభిమానులు భావిస్తున్నారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్టు తెలిసింది. 

Updated Date - Oct 05 , 2025 | 06:17 PM