సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay - Rashmika: విజయ్‌ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది 

ABN, Publish Date - Oct 03 , 2025 | 11:12 PM

విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబితున్నారని కొన్నేళ్లగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని కూడా వార్తలొచ్చాయి.  ఈ విషయాన్నీ ఈ జంట ముందు ఉంచిన ప్రతిసారి ఏదోలా తప్పించుకునే వారు.

Vijay Devarakonda and Rashmika

విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబితున్నారని కొన్నేళ్లగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని కూడా వార్తలొచ్చాయి.  ఈ విషయాన్నీ ఈ జంట ముందు ఉంచిన ప్రతిసారి ఏదోలా తప్పించుకునే వారు. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. త్వరలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్  రష్మిక (Rashmika) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబాలు, కొద్ది మంది బంధువుల సమక్షంలో హైదరాబాద్‌లో ఇద్దరికీ  నిశ్చితార్థం శుక్రవారం జరిగినట్టు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని విజయ్‌ సన్నిహితుల ద్వారా తెలిసింది.     

'చల్లో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రష్మిక తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తదుపరి ‘గీత గోవిందం’ సినిమాతో విజయతో కలిసి నటించి హిట్‌ పెయిర్‌గా నిలిచారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్‌’లోనూ నటించారు. ఇద్దరు రిలేషన్‌లో ఉన్నట్టు వచ్చినా స్నేహితులమనే చెప్పువారు. ఇద్దరు కలిసి టూర్స్ కి వెళ్లడం, పార్టీల్లో పాల్గోవడంతో రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి.  ఇప్పుడు నిశ్చితార్థ వార్త అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

Updated Date - Oct 03 , 2025 | 11:19 PM