సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay - Keerthy: విజయ్ దేవరకొండ, కీర్తి సురేశ్‌.. మాస్ తాండవం బిగిన్స్

ABN, Publish Date - Oct 11 , 2025 | 11:37 AM

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత  అల్లు అరవింద్ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. 

Vijay Devarakonda And Keerthy Suresh

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ‘రౌడీ జనార్దన్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న రవికిరణ్‌ కోల దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తున్నారు.

శనివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా (Rowdy Janardhana) లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత  అల్లు అరవింద్ తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. 

విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. ఈసారి విజయ్‌తో యాక్షన్‌కు ప్రాధాన్యం ఉన్న కథను తెరకెక్కించనున్నారు రవి కిరణ్. ఈనెల 16 నుంచి ముంబైలో  రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.  

Updated Date - Oct 11 , 2025 | 01:49 PM