Vijay Devarakonda: డాన్ కి విలన్ గా రౌడీ హీరో.. రూట్ మార్చాడా

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:22 PM

రౌడీ హీరో రూట్ మార్చాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. ఈమధ్యకాలంలో హీరోలు కేవలం హీరోలుగానే కాకుండా మంచి ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలలో అయినా నటిస్తున్నారు.

Vijay Devarakonda

Vijay Devarakonda: రౌడీ హీరో రూట్ మార్చాడా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. ఈమధ్యకాలంలో హీరోలు కేవలం హీరోలుగానే కాకుండా మంచి ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలలో అయినా నటిస్తున్నారు. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కూడా మెప్పిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం దీనికి ఆతీతం కాదు. అవును.. తాజాగా ఒక స్టార్ హీరో.. మరో స్టార్ హీరో సినిమాలోవిలన్ గా నటిస్తున్నాడు అనే వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆ హీరో ఎవరు.. ? ఆ సినిమా ఏంటి.. ? అనేది తెలుసుకుందాం.


బాలీవుడ్ హిట్ సినిమాల్లో షారుఖ్ ఖాన్ డాన్ సినిమా ఒకటి. డాన్ గా షారుఖ్ నటనకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహించిన డాన్, డాన్ 2 సినిమాలు బాలీవుడ్ ను షేక్ చేశాయి. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈసారి ఫరాన్ సరికొత్త డాన్ ను ఇండస్ట్రీకి చూపించబోతున్నాడు. గత కొన్నిరోజులుగా డాన్ 3 ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈసారి షారుఖ్ కాకుండా డాన్ గా రణ్వీర్ సింగ్ ను తీసుకొచ్చాడు ఫరాన్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.


ఇక అందుతున్న సమాచారం ప్రకారం డాన్ 3 సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్.. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు. ఆ తరువాత వరుస సినిమాలతో స్టార్ గా మారిన విజయ్ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో బిజీగా మారాడు. ఈ నెలలోనే కింగ్డమ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. డాన్ 3 లో రణ్వీర్ కు ధీటుగా విజయ్ పాత్ర ఉంటుందని, బాలీవుడ్ లో ఈ పాత్ర చాలా కీలకం అవుతుందని, అది విజయ్ కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుందని కుర్ర హీరో కూడా ఓకే చెప్పాడని టాక్.


నిజం చెప్పాలంటే విజయ్ కి ఇది మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమాలు వచ్చాకా.. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా హీరోలు ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే వార్ 2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా డాన్ 3 తో ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే మేకర్స్ అధికారికంగా విజయ్ ను డాన్ 3 లోకి ఆహ్వానించనున్నారట. మరి ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లో పాగా వేస్తాడో లేదో చూడాలి.

Peddi: గౌర్నాయుడుగా శివన్న.. ఆసక్తికరంగా లుక్.. 

Updated Date - Jul 12 , 2025 | 12:23 PM