Karan Johar: బాలీవుడ్ బడా నిర్మాత పనైపోయిందా..
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:06 PM
కొత్త నీరు వస్తుంది అంటే పాత నీరు వెళ్లిపోవాల్సిందే. అదే సమాజ ధర్మం. జనరేషన్ మారేకొద్దీ ఆలోచనలు మారతాయి. కథలు మారతాయి.
Karan Johar: కొత్త నీరు వస్తుంది అంటే పాత నీరు వెళ్లిపోవాల్సిందే. అదే సమాజ ధర్మం. జనరేషన్ మారేకొద్దీ ఆలోచనలు మారతాయి. కథలు మారతాయి. అందుకే ఒకప్పటి తరంవారందరూ ఇప్పటి జనరేషన్ కు నచ్చడం లేదు. అందురికే చాలావరకు ప్రొడక్షన్ కంపెనీలు సినిమాలు తీయడానికి ఆలోచిస్తున్నాయి. బాలీవుడ్ లో ఎన్ని తరాలు మారినా ప్రేక్షకులను అలరించడమే ధ్యేయంగా పెట్టుకున్న నిర్మాణ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్. బాలీవుడ్ బడా నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు కరణ్ జోహార్ (Karan Johar). బాలీవుడ్ మొత్తాన్ని తన కనుసన్నల్లో నడిపిన వ్యక్తిగా కరణ్ జోహార్ కు సపరేట్ గుర్తింపు ఉంది అంటే అతిశయోక్తి కాదు.
అన్ని రోజులు ఒకేలా ఉండవు. అప్పటిలా కరణ్ పరిస్థితి ఇప్పుడు లేదు. జనరేషన్ మారేకొద్దీ బాలీవుడ్ లో కూడా చాలా మారాయి. ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్ ప్లాపుల పరంపరలో కొనసాగుతుంది. ఒకప్పుడు కరణ్ నుంచి సినిమా వస్తుంది అంటే.. కేవలం బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా దాని గురించి చర్చ జరిగేది. కానీ, ఇప్పుడు కరణ్ నుంచి సినిమా వస్తుంది అంటే.. ఓ అవునా... కథ నచ్చితే చూద్దాం అనో పెదవి విరుస్తున్నారు. అంతెందుకు ఈ మధ్య ధర్మ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ధడక్ 2 పరిస్థితి ఏమైంది..?. కనీసం అది ఎప్పుడు వచ్చింది.. ? ఎప్పుడు పోయింది అన్న విషయం కూడా ఎవరికీ తెలియలేదు.
ఇక దీంతో బాలీవుడ్ మీడియాలో కరణ్ జోహార్ పనైపోయిందా.. ? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. మునుపటిలా ధర్మ ప్రొడక్షన్స్ నుంచి వరుస సినిమాలు రావడం లేదు. ఎందుకంటే ఫెయిల్యూర్ భయంతోనే కరణ్ సినిమాలు తగ్గించాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆయన సినిమాలపై నెగిటివిటీ ఎక్కువ కావడంతో ప్రేక్షకులు కూడా కరణ్ సినిమాలకు రావాలని కోరుకోవడం లేదని అంటున్నారు. ఇలా అయితే ఈ బడా నిర్మాత భవిష్యత్ ఎటుపోతుందో అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ముందు ముందు కరణ్ సినిమాలు నిర్మించడం మానేస్తాడా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Love Returns: భార్య, ప్రియురాలు.. ఒకే ఇంటిలో ఉంటే! అదిరిపోయే యూట్యూబ్ మినీ సిరీస్
KVN Productions: పెద్ద ఫ్లానే ఇది..హోంబలే, మైత్రిలకు పోటీగా మరో నిర్మాణ సంస్థ